ఐటీ ఉద్యోగులకు మెట్రో శుభవార్త

Metro good news for IT employees

ఐటీ ఉద్యోగులకు మెట్రో శుభవార్త చెప్పింది. సైబర్ టవర్స్ వద్ద మెట్రో రివర్స్ అల్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అమీర్‌పేట, హైటెక్ సిటీ మార్గంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మెట్రో రైలు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు మియపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలోనూ ఐదు నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉండేదని ఇప్పుడు హైటెక్ సిటీ మార్గంలోను అందుబాటులో ఉంటుందని అధికారులు  పేర్కొన్నారు. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ మార్చిలో ప్రారంభించినా సైబర్ టవర్స్ వద్ద రైలు ట్రాక్ మారేందుకు అవకాశం లేకపోవడంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి హైటెక్ సిటీ కి చేరుకొని అక్కడి నుంచి అదే ట్రాక్ లో మెట్రో రైలు వెనకి తిరిగి వచ్చేవి.

మాదాపూర్ గచ్చిబౌలి ఐటీ కారిదార్లలో దాదాపు 5లక్షల మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. ఎల్బీనగర్ నుంచి మాదాపూర్ చేరుకోవడానికి బస్సులో సొంత  వాహనాల్లో రావడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. అదే మెట్రో లో ప్రయాణిస్తే గంటలో నే కార్యాలయనికి చేరుకొనే వీలు ఉంటుంది.