పెద్దమ్మ గురించి మొదటి సారి ఎన్టీఆర్‌…!

Jr NTR And Kalyan Ram Gets Emotional At Pre Release Event

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ తాజా చిత్రం ‘అరవింద సమేత’ అక్టోబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో చిత్ర యూనిట్‌ అంతా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చాలా బిజీ అయ్యారు. ఎద నిండా భాద ఉన్నా కూడా ఎన్టీఆర్‌ ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గోనక తప్పడం లేదు. ఎన్టీఆర్‌ తండ్రి నందమూరి హరిక్రిష్ణ ఆకస్మిక మరణం నందమూరి కుటుంబం ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కూడా ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్‌ రామ్‌లు ఏడ్చి అందరిని ఏడిపించిన విషయం తెల్సిందే.

ntr

ఎన్టీఆర్‌ తన తండ్రి లేని లోటును ఎవరూ తీర్చలేరని, తనని చాలా మిస్‌ అవుతున్నామని బోరున విలపించాడు. అంతేకాకుండా ఇద్దరు అమ్మలు ఇంకా దు:ఖం నుండి తేరుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. అమ్మ కాస్త ఇద్దరు మనవళ్లతో కుదుటపడిరది కానీ పెద్దమ్మ (కళ్యాణ్‌ రామ్‌ తల్లి) ఇంకా ఆ భాదను దిగమింగుకోలేకపోతున్నట్టు ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు.

kalyan-ntr-mother

ఎన్టీఆర్‌ బాహటంగా తన పెద్దమ్మ ప్రస్తావన తేవడం ఇదే మొదటిసారి. ఇద్దరు అమ్మల గురించి చెప్పి తామంతా ఒకేటనని పరోక్షంగా అందరికి తెలియజేశాడు. ఏది ఏమైనా కూడా హరిక్రిష్ణ మరణం కేవలం కుటుంబ సభ్యలకే కాకుండా నందమూరి అభిమానులకు కూడా తీరని లోటు.

ntr-kalyan