1974 లో మంచి మనుషులు సినిమాతో బాల నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యి, 1989 లో అడవిలో అభిమన్యుడు అనే సినిమా ద్వారా హీరోగా మారిన నటుడు జగపతి బాబు. ఇలా ఆయన తెలుగు చిత్ర సీమలో దాదాపుగా 29 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. యంగ్ ఏజ్ లో ఫ్యామిలీ, ప్రేమ కథా చిత్రాలతో బాగా పాపులర్ అయిన జగపతి బాబు గారూ ఒకానొక సమయానికి హిట్స్ లేని పరిస్థితికి వచేసారు. ఇక తన సినిమా కెరీర్ ముగుసిపోతుందేమో అన్న సమయంలో బాలయ్య, బోయపాటి లెజెండ్ లో విలన్ పాత్ర దక్కింది.
ఏ ముహూర్తంలో ఆ విలన్ అవతారం ఎత్తారో గానీ, ఆ తరువాత మళ్ళీ తిరిగి చూసుకోలేదు. అసలు చెప్పాలంటే ఒక రకంగా హీరోగా కన్నా కూడా ఆయన విలన్ గా మారిన తరువాతే ఎక్కువ క్రేజ్ ని సంపాదించారు. కథానాయకుడు సినిమాలో ఆయన నటన చూసిన వాళ్ళు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, ఎంతలా కాకపోతే ఆ సినిమా హీరో అయిన సూపర్ స్టార్ రజినీకాంత్ గారు ఆయన్ని గ్రేట్ యాక్టర్ ఆకాశానికి ఎత్తేస్తారు. అలా, తన నటనతో సెకండ్ హాఫ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు. తెలుగులో తండ్రి గాను, విలన్ గాను టాప్ హీరోలందరికి ఈయనే ఫస్ట్ ఆప్షన్. అలాగే, మోహన్ లాల్ గారి పులి మురుగన్ సినిమాలో కూడా విలన్ గా చేసి మలయాళంలో కూడా ఆయన మార్క్ క్రియేట్ చేశారు.
అయితే, ఇలా ఎంతో మంది హీరోల సినిమాలలో నటిస్తూ ఉన్న ఈయనని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ “మీరు ఇండస్ట్రీ లో ఎవరితో పెద్దగా కలవరంటగా, ఎందుకని?” అని అడిగారు. దానికి ఆయన “అంటే, నేను పెద్దగా మాటలు కలపలేను. ఒక్కోసారి యాక్టింగ్ చెయ్యాల్సి వస్తుంది, అది నాకు చేయడం ఇష్టం లేదు. ఇండస్ట్రీ లో చాలా మంది జన్యున్ పీపుల్ ఉన్నారు, వాళ్ళతో కలుస్తాను, వాళ్ళతో బాగానే మాట్లాడతాను. ఇప్పుడు, ప్రభాస్ ఉన్నాడు ఎప్పుడు ఫోన్ చేసిన మిస్ అయితే మళ్ళీ ఖచ్చితంగా రిటర్న్ కాల్ చేస్తాడు. అలాగే, చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు, అందరితో అట్లానే ఉంటాడు తనకు నచిన వాళ్ళతో, అలాగే తారక్ కూడా, అలా కొంతమంది.
నేను ముందే వాళ్ళకు చెప్పేస్తా నేను ఫోన్ చెయ్యను అని. ఎందుకంటే, వాళ్ళు ఏ మూడ్ లో అయిన ఉండొచ్చు, డిస్టర్బ్ చేయ్యదలుచుకోను. కానీ, మీరు ఏ టైం లో అయినా ఫోన్ చెయ్యండి, నేనే మీ ఇంటికి వచ్చేస్తా అని.” అని సమాధానమిచ్చారు. అలా, ఆయన ఏమనుకుంటారో అది చెప్పేసే మనస్తత్వం ఉన్నవారు అని ఆయన ఇదివరకే చాలా సందర్భాలలో రుజువు చేశారు, తాజాగా మళ్ళీ ఇప్పుడు. ప్రస్తుతం ఆయన సైరా, నారా రోహిత్ ఆటగాళ్ళు సినిమాలు చేస్తున్నారు.