Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“శంకరాభరణం” భారతీయ సినిమా స్థాయిని ఇంకో ఎత్తుకి తీసుకెళ్లిన చిత్రరాజం. ఆ సినిమాతో సంగీతానికి తెలుగింట ఎంత ప్రాధాన్యం వచ్చిందో వేరే చెప్పక్కర్లేదు.ఎందరికో వెండితెరబిక్ష పెట్టడమే ఆ సినిమా సాధించిన విజయాల్లో ఇంకో గొప్ప విషయం.ఆ సినిమాలో బాలనటిగా పనిచేసిన తులసి ఇప్పుడు తల్లి పాత్రల్లో కూడా నటిస్తోంది.తనకు నటజీవితాన్ని ఇచ్చిన శంకరాభరణం పేరు మీదుగా అవార్డు ఇవ్వాలని తులసి నిర్ణయించుకుంది. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన కళాతపస్వి కె .విశ్వనాధ్ గౌరవార్ధం ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కూడా ఆమె చెప్పారు .నెలల వ్యవధిలోనే శంకరాభరణం అవార్డుల ప్రదానం వేదిక ,డేట్ కూడా తులసి ప్రకటించేశారు.
మొత్తం ఐదు భాషల సినిమాలకి శంకరాభరణం అవార్డ్స్ ఇవ్వనున్నారు.దక్షిణాదికి చెందిన నాలుగు భాషలతో పాటు హిందీ చిత్ర రంగానికి కూడా ఈ అవార్డులు ఇస్తున్నారు.హిందీకి సంబంధించి దంగల్ సినిమాకి గాను అమిర్ ఖాన్,ఉడుత పంజాబీ సినిమాకి అలియా భట్ ఉత్తమనటులుగా అవార్డు తీసుకోనున్నారు. ఇక రజని అల్లుడు,తమిళ్ యంగ్ హీరో ధనుష్ తాను చేసిన పా పాండి చిత్రానికి ఉత్తమదర్శకుడి అవార్డు గెలుచుకోవడం చిత్రం.మలయాళంలో ముమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ ఓరు వాడక్కన్ సెల్ఫీ చిత్రానికి బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచారు.
తెలుగు కి వచ్చేసరికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ శంకరాభరణం అవార్డు అందుకోబోతున్నారు. జనతా గ్యారేజ్ లో నటనకు గాను ఎన్టీఆర్ కి శంకరాభరణం అవార్డు దక్కబోతోంది.ఇప్పటికే జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కి ఎన్నో అవార్డ్స్,రివార్డ్స్,కలెక్షన్స్,రికార్డ్స్ తెచ్చిపెట్టింది.ఇప్పుడు కళాతపస్వి విశ్వనాధ్ గౌరవార్ధం ఇస్తున్న శంకరాభరణం కూడా అందించింది.