అదిప్పుడు నాకు సాధ్యం కాదేమో… అయినా ప్రయత్నిస్తా

Jr NTR comments On Adhurs 2 movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్‌ అభిమానులు ‘జై లవకుశ’ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడు విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఎన్టీఆర్‌ రాబోతున్నాడు. ఈ సందర్బంగా మీడియాతో ఈ చిత్ర విశేషాలను ఎన్టీఆర్‌ పంచుకున్నాడు. అదే సమయంలో వినాయక్‌తో ‘అదుర్స్‌ 2’ చిత్రంపై కూడా స్పందించాడు. ఎన్టీఆర్‌తో వినాయక్‌కు అదుర్స్‌ 2 చేయాలని చాలా కాలంగా ఉంది. అయితే మంచి కథ రెడీ కాకపోవడంతో ఆలస్యం అవుతూ వస్తుంది.

ఇటీవల జైలవకుశ ప్రీ రిలీజ్‌ వేడుకలో కూడా అదుర్స్‌ 2 కథను ఎప్పుడు రెడీ చేస్తారు అంటూ కోన వెంకట్‌ను అభిమానుల సమక్షంలో ప్రశ్నించాడు. అందుకు ఆయన నవ్వేశాడు. అదే విషయాన్ని ఎన్టీఆర్‌ ముందు ఉంచగా, అప్పుడు అదుర్స్‌లో చారి పాత్ర చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఆ పాత్రకు న్యాయం చేయగలనా అనే భయం నాకే కలుగుతోంది. అదుర్స్‌ 2 అన్న ప్రతిసారి కూడా నాలో ఆ భయం కలుగుతూనే ఉంది. కాని వినాయక్‌ ఆ ప్రాజెక్ట్‌తో వస్తే తప్పకుండా చేస్తాను, ఆ స్థాయిలో కాకుండా ప్రేక్షకులను అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.