Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న ‘జై లవకుశ’ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ‘జై లవకుశ’ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. విడుదలకు ఇంకా నెల సమయం ఉండగానే ఎన్టీఆర్ తన పని పూర్తి చేయడం జరిగింది. ఇటీవలే సినిమాకు సంబంధించి కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందని, మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందని అన్నారు. తాజాగా ఆ రెండు పాటల చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది. త్వరలోనే సినిమా ఆడియోను విడుదల చేయబోతున్నారు.
చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరిగేలోపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేయాలనే పట్టుదలతో దర్శకుడు బాబీ ఉన్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమా డబ్బింగ్‌ను మరో రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేయనున్నాడు. సినిమా విడుదలకు ఇంకా నెల సమయం ఉండగానే హీరో డబ్బింగ్ పూర్తి అవ్వడం చాలా అరుదు. అనుకున్న సమయంకు విడుదల అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అయినప్పటికి నెల ముందే ‘జై లవకుశ’ పను పూర్తి చేసి టీం వర్క్ అదరహో అనిపించారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు సంబంధించి ప్లాన్ కూడా సిద్దం అయ్యింది. ఎన్టీఆర్ మొదటిసారి విన్‌గా నటిస్తున్న ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు కూడా చెబుతున్నారు.
మరిన్ని వార్తలు: