ఎన్టీఆర్‌ ఏంటో ఒక్క మాటలో తేల్చేశాడు…!

Jr NTR Is My Life Says Manchu Manoj

మంచు హీరో మనోజ్‌, ఎన్టీఆర్‌ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి పుట్టిన రోజులు ఒకటే, ఈ ఇద్దరి సతీమణుల పేర్లు కూడా కలవడం విశేషం. చిన్నప్పటి నుండి ఈ ఇద్దరి మద్య స్నేహం కూడా అంతలా ఉంది. మనోజ్‌కు ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టమని, ఎన్టీఆర్‌ని ఎంతగానో అభిమానిస్తాను అంటూ గతంలో చాలాసార్లు చెప్పిన విషయం తెల్సిందే. చిన్నప్పుడు ఎన్టీఆర్‌ను ఏదో అన్నారని మనోజ్‌ సదరు వ్యక్తి చేయి విరగొట్టాడట. అప్పటి నుండే మనోజ్‌కు ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టమని చెబుతుంటాడు.

ntr

ఎన్టీఆర్‌ తండ్రి హరిక్రిష్ణ చనిపోయినపుడు కూడా మనోజ్‌ పక్కన ఉండి ఎన్టీఆర్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. జనాలు ఎన్టీఆర్‌ మీదకు తోసుకొస్తున్న వేళ బౌన్సర్‌గా ఎన్టీఆర్‌ పక్కన ఉండి తన స్నేహం ఎంత స్వచ్చమైందో చెప్పకనే చెప్పాడు. తాజాగా ఎన్టీఆర్‌ అభిమాని ఎన్టీఆర్‌ గురించి ఒక్క మాటలో చెప్పు అన్నా అంటూ మనోజ్‌ను ప్రశ్నించగా ఎన్టీఆర్‌ నా ప్రాణం అంటూ ఒక్కమాటలో జవాబిచ్చాడు. దాంతో ఎన్టీఆర్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అయ్యారు. ఎన్టీఆర్‌, మనోజ్‌ల స్నేహం చాలా గొప్పది అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

ntr-manchu