ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ కి హరికృష్ణ అడ్డం…!

Jr NTR Re Entry To Support TDP Party In 2019 Elections

బుడ్డోడి సక్సెస్ మీట్ కి బాలయ్య వస్తున్నాడంట !…సరిగ్గా ఫంక్షన్ కి ఒక్క రోజు ముందు వచ్చిన ఈ ప్రకటన నందమూరి అబిమానుల కళ్ళమ్మట నీళ్ళు తెప్పించిన ప్రకటన ఇది. ఇటీవల హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత మూడో రోజు అంటే చిన్న కర్మ రోజు బాలకృష్ణ, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఓ సీక్రెట్ వీడియో బయటకు వచ్చింది. అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. కుటుంబసభ్యులంతా మాట్లాడుకుంటే దానికి అంత విశేషం ఎందుకు అని అందరికీ అనిపించొచ్చు కానీ రాజకీయాల మీద అప్పటి వరకూ ఉన్న పుకార్లు ఆ వీడియో వైరల్ అవడానికి కారణం అయింది.
వాస్తవానికి ఆ కుటుంబంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, కానీ దాదాపు చాన్నాళ్ళ నుండీ జూనియర్, బాలకృష్ణ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. చాలా కాలంగా ఒకే వేదికపై కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే కుటుంబ ఫంక్షన్లలోనూ కలిసింది లేదు. అయితే హరిరిష్ణ విషాదం మళ్లీ వారిని కలిపిన సూచనలు కనిపిస్తున్నాయి. మొన్న జరిగిన అరవింద సమేత సినిమా సక్సెస్‌మీట్‌కు నందమూరి బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్ రామ్ లు కలిసి హాజరవయ్యారు. గతంలో బాలకృష్ణ నటించిన “సింహా” సినిమాకు సంబంధించిన విజయోత్సవానికి ఎన్టీఆర్‌ రావడమే చివరిసారి ఇద్దరూ కలిసి కనపడడం, మళ్లీ ఇప్పుడే కలసి కనిపించారు.

ntr
ఇప్పుడీ కలయిక రాజకీయవర్గాల్లోనూ వైరల్ అవుతోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయ పరంగా మళ్లీ దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతకుముందు పొలిట్ బ్యూరో సభ్యుడిగా నందమూరి కృష్ణ ఉండేవారు. ఆయనకు రాజ్యసభ సీటు మరలా ఇచ్చే విషయంలో వచ్చిన విభేదాల వలన ఆయన అప్పటి నుండి పార్టీ కి దూరంగా ఉంటూ వచ్చారు. కుటుంబం నుంచి చరిష్మా ఉన్న ఎన్టీఆర్ ని పార్టీ దగ్గరకు తీసుకుని తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో వేలు పెట్టకపోవచ్చని భావిస్తున్నారు.

ntr-chandrababau
ఎందుకంటే ఇంతకు మునుపు 2009లో స్టార్ క్యాంపెయినర్ గా జూనియర్ ను వాడుకున్న పార్టీ ఆ తర్వాత జూనియర్ ని ఏ పార్టీ కార్యక్రమానికి పిలిచింది లేదు. పైపెచ్చు లోకేష్ కి పోటీ అనే ఒక సరికొత్త వాదన పుట్టుకురావడంతో అసలే పక్కన పెట్టేసింది. ఆ తర్వాత బాలయ్యతో వచ్చిన చ్చిన మనస్పర్ధలు, విజయవాడ ఎన్టీఆర్ పర్యటనకు టీడీపీ కార్యకర్తలను వెళ్లోద్దని సందేశాలు పంపడం లాంటివి జరగడంతో ఇప్పుడు బాబును ఎన్టీఆర్ పూర్తిగా నమ్మే పరిస్థితి లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి తండ్రి మరణం ఒక వంకగా చూపెట్టి తప్పించుకునే ప్రయత్నం జూనియర్ చేయవచ్చని , మరీ అంతగా బలవంత పెడితే మీడియా ముఖంగా ఒక ప్రకటన తెలుగుదేశానికీ మద్దతు ఇస్తున్నట్టు చేయచ్చని తెలుస్తోంది. అయితే తన తండ్రికి, తనకు జరిగిన అనుభవాళ దృష్ట్యా ఆయన ఈ పాలిట్రిక్స్ కి దూరంగా ఉండవచ్చని భావిస్తున్నారు.

ntr-harikrishna