ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందిన ‘అరవింద సమేత’ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రం రికార్డు స్థాయి ధరకు అమ్ముడు పోయిందని మనం ఇప్పటికే చెప్పుకోవడం జరిగింది. దాదాపు 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదే ఈ చిత్రంలో అభయ్ రామ్ కనిపించబోతున్నాడు అంటూ వస్తున్న వార్త.
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అరవింద సమేత చిత్రంలో చిన్న ఎన్టీఆర్‌గా అభయ్ రామ్ కొన్ని నిమిషాల పాటు కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రంలో అభయ్కు ఎలాంటి డైలాగ్స్ ఉండబోవని, కేవలం కొన్ని సీన్స్‌లో కనిపిస్తాడు అంతే అంటూ ప్రచారం జరుగుతుంది. కాని ఈ విషయమై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా పుకార్లు నిజం కాదని కొందరు అంటున్నారు. సెట్స్‌కు వచ్చినంత మాత్రాన అభిరామ్ ఈ చిత్రంలో నటించాడు అనుకుంటే ఎలా అంటూ కొందరు పుకార్లపై స్పందిస్తూన్నారు. మరి అసలు విషయం ఏంటో అనేది మరో అయిదు రోజుల్లో సినిమా విడుదల అయ్యాక తేలే అవకాశం ఉంది.