Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్ హీరోలకి ఎంత డిమాండ్ వున్నా సినిమాల వెంట సినిమాలు చేయలేని పరిస్థితి. కధలు, దర్శకుల కొరత వల్ల మాత్రమే కాదు ఒక్కో సారి టైం కూడా సెట్ కాదు. టైం బాగాలేకపోవడం ఒక ఎత్తు అయితే టైం సెట్ కాకపోవడం ఇంకో ఎత్తు. జైలవకుశ భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ కి అదే పరిస్థితి ఎదురైంది. త్రివిక్రమ్ తో సినిమా సెట్ అయినప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యేది మార్చి లో. జైలవకుశ రిలీజ్ కి ముందు దాదాపు పదినెలల సమయం లో అలుపు, విరామం లేకుండా పని చేశారు ఎన్టీఆర్. ఇప్పుడు ఆ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యాక ఓ నెల పాటు భార్య, కొడుకుతో యూరప్ ట్రిప్ కి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఆ టూర్ కి సినిమా మొదలయ్యే మధ్య దాదాపు 4 నెలల గ్యాప్ వుంది. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ఏమి చేయబోతున్నాడు అన్నదే ఇంటరెస్టింగ్ పాయింట్.
త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాలో ఎన్టీఆర్ ది మిలిటరీ సోల్జర్ పాత్ర అని అంటున్నారు. ఇది దేశ భక్తి సినిమా కాకపోయినా అందులో హీరో పాత్ర సోల్జర్ కావడంతో అందుకు తగ్గట్టు దేహాన్ని మలుచుకోవాలని ఇప్పటికే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి చెప్పారట. ఈ నాలుగు నెలలు ఎన్టీఆర్ అదే పనిలో ఉంటారట. అయితే ఈ వ్యవధిలో ఎన్టీఆర్ తో ఓ మంచి ఫామిలీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి దిల్ రాజు వువ్విళ్ళురుతున్నాడట. శతమానంభవతి దర్శకుడు సతీష్ వేగేశ్న చెప్పిన కథ ఎన్టీఆర్ కి బాగా సరిపోతుందని దిల్ రాజు అనుకుంటున్నారట. కథ నచ్చినా ఎన్టీఆర్ ఇంకా ఏమీ చెప్పలేదట. మొత్తానికి ఫామిలీ ట్రిప్ తర్వాత తీసుకునే నిర్ణయం మీద నవంబర్ నుంచి మార్చి దాకా ఎన్టీఆర్ సినిమా చేస్తాడా లేక కసరత్తులకే పరిమితం అవుతాడా అన్నది తేలిపోతుంది.