Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బిగ్ బాస్ తెలుగు లోగిళ్ళలో ఎంత సందడి చేసిందో చూసాం. విదేశీ సంస్కృతిని ప్రతిబింబించే ఈ షో ఎక్కడ సక్సెస్ అవుతుంది అనుకున్నవాళ్ళు టీఆర్ఫీ రేటింగ్స్ చూసి షాక్ అయిపోయారు. ఈ సక్సెస్ లో పార్టిసిపంట్స్ కన్నా వ్యాఖ్యాత రోల్ ప్లే చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మంచి పేరు వచ్చింది. అందుకే స్టార్ హీరోగా ఉండి కూడా ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించాలన్న ఎన్టీఆర్ నిర్ణయానికి అంతా అభినందనలు తెలిపారు. అయితే ఈ విషెస్ లో ఎక్కువ షో సక్సెస్ అయ్యాక వచ్చినవే. ఆ వ్యవహారం అంతా చూసిన వాళ్లకి ఇక బిగ్ బాస్ కి తెలుగులో ఎన్టీఆర్ శాశ్వత హోస్ట్ అనుకున్నారు. అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ రెండో సీజన్లో తాను హోస్టింగ్ బాధ్యతలు చేపట్టలేనని ఎన్టీఆర్ చెప్పినట్టు ఇప్పుడు ఫిలిం నగర్ లో రై రై మంటూ ఓ పుకారు షికారు చేస్తోంది.
త్రివిక్రమ్, రాజమౌళి తో వరసగా సినిమాలు చేయబోతున్న ఎన్టీఆర్ ఈ కీలక సమయంలో బిగ్ బాస్ ఒప్పుకోవడం మంచిది కాదని భావిస్తున్నాడట. జైలవకుశ టైం లో బిగ్ బాస్ చేసి పని ఒత్తిడి కి లోనైన ఎన్టీఆర్ ఆ విషయం గుర్తుంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్, రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులతో పని చేసేటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే ఆ సినిమాల మీద ఏకాగ్రత లేకుండా పోతుందని ఎన్టీఆర్ భయపడుతున్నారట. అందుకే బిగ్ బాస్ కి ఎన్టీఆర్ నో చెపుతున్నారట. దీంతో సీజన్ 2 కి ప్లాన్ చేసుకుంటున్న బిగ్ బాస్ టీం ఇప్పుడు కొత్త హోస్ట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిందట. వాళ్ళ దృష్టిలో టాలీవుడ్ కి చెందిన ఓ సీనియర్, ఓ జూనియర్ హీరో పేర్లు చురుగ్గా వినిపిస్తున్నాయట.