Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నిన్న ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఈ ప్రారంభోత్సవంకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. మొదటి షాట్‌కు ఎన్టీఆర్‌పై పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టిన విషయం తెల్సిందే. ఈ సందర్బంగా వీరిద్దరి మద్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇద్దరు కూడా కొన్ని నిమిషాల పాటు చాలా క్లోజ్‌గా మాట్లాడుకోవడంతో పాటు, వారు చేస్తున్న సినిమాల గురించి చర్చించడం జరిగింది. పవన్ క్లాప్ కొట్టడంతో ఎన్టీఆర్ సినిమా స్థాయి అమాంతం పెరిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబో మూవీపై నందమూరి అభిమానులతో పాటు, పవన్ ఫ్యాన్స్ కూడా దృష్టి పెడతారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 25వ చిత్రం షూటింగ్ జరుగుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. వచ్చే నెలలో సినిమా ఆడియో వేడుక లేదా ప్రీ రిలీజ్ వేడుకను దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ వేడుకకు ఎన్టీఆర్‌ను ముఖ్య అతిథిగా తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ షూటింగ్ ప్రారంభోత్సవంకు వచ్చిన కారణంగా త్వరలోనే జరుగబోతున్న వేడుకకు ఎన్టీఆర్ వస్తాడని అంతా ఆశిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. కాని చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎన్టీఆర్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాత వాసి ఆడియో విడుదల కార్యక్రమం లేదా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరుగబోతుందని నమ్మకంతో చెబుతున్నారు. గతంలో పవన్ కోసం మహేష్‌బాబును, ఆ తర్వాత మహేష్‌బాబు కోసం పవన్‌ను వాడిన త్రివిక్రమ్ ఈ సారి ఎన్టీఆర్ కోసం పవన్‌ను, తర్వాత పవన్ కోసం ఎన్టీఆర్‌ను రంగంలోకి దించుతున్నాడు.