బిగ్‌బాస్‌ ఇంటికి ఎన్టీఆర్‌?

junior ntr in nani bigg boss 2 house

సాదారణంగా బిగ్‌బాస్‌ ఇంట్లో సినిమాల ప్రమోషన్స్‌ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు సందడి చేసిన విషయం మనం ఇప్పటి వరకు చూశాం. అయితే త్వరలోనే బిగ్‌బాస్‌ను ప్రమోట్‌ చేసేందుకు ఎన్టీఆర్‌ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మొదట ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2ను ప్రారంభం రోజునే ఎన్టీఆర్‌ను తీసుకు వస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఎన్టీఆర్‌ బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తాజాగా ఇంట్లోకి కొన్ని గంటల పాటు ఎన్టీఆర్‌ను పంపించాలనే నిర్ణయానికి స్టార్‌ మా వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పటికే అందుకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయి. ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ కోసం డేట్‌ను కూడా ఇచ్చేశాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చే వారంలో ఎన్టీఆర్‌ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు ప్రస్తుతం మంచి రెస్పాన్స్‌ వస్తుందని, ఆ రెస్పాన్స్‌ను మరింతగా పెంచాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌తో సంప్రదించినట్లుగా విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం షూటింగ్‌కు బ్రేక్‌ తీసుకుని బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై అధికారికంగా ప్రకటన రాలేదు. ఎన్టీఆర్‌ నిజంగానే బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్తే షోకు విపరీతమైన క్రేజ్‌ వచ్చే అవకాశం ఉంది.