ముంబైలో ఘోర విమాన ప్రమాదం, ఇంటి మీద పడి ఐదుగురు మృతి

Small Plane Crashes Into Construction Site in mumbai

ముంబైలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఓ చార్టర్డ్ విమానం ముంబైలోని ఓ రద్దీ ప్రాంతంలో కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం ఘట్కోపర్‌లో సర్వోదయ్ నగర్‌లో ఈ ప్రమాదం చేసుకుంది. ప్లేన్‌ ల్యాండ్‌ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. విమానంలో ఉన్న నలుగురు సహా కింద వెళ్తున్న పాదచారి కూడా మృతి చెందారు. విమానం కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు.

జుహు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతూ నిర్మాణంలో ఉన్న ఓ భవంతిపై కుప్పకూలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం ఘటనా ప్రాంతానికి తరలివెళ్లాయి. కాగా, కొద్ది రోజుల క్రితం ఈ విమానానికి రిపేర్లు చేసినట్లు తెలిసింది. ఈ విమానం యూవై ఏవియేషన్ కు చెందిన విమానంగా గుర్తించారు. టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2014లో ఈ విమానాన్ని యావై ఏవియేషన్ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో ముంబైలో కూలిన ఛార్టర్డ్‌ విమానం ఉత్తర్‌ప్రదేశ్‌ది కాదని ముంబై యూవై ఏవియేషన్‌కి అమ్మేశామని యుపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.