అవును అనుకుంటున్నా, కాని..!

Keerthy Suresh to act in NTR-Ram Charan Multistarrer movie

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మహానటి విడుదల అయినప్పటి నుండి కూడా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నాయి. కీర్తి సురేష్‌ మల్టీస్టారర్‌లో ఉంటే తప్పకుండా సినిమా క్రేజ్‌ పెరుగుతుందని అంతా భావించారు. అంతా అనుకున్నట్లుగానే రాజమౌళి తన మల్టీస్టారర్‌ చిత్రంలో కీర్తి సురేష్‌ను అనుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. చిత్రంకు సంబంధించిన యూనిట్‌ సభ్యుల్లో ఒక్కరు ఈ విషయాన్ని మీడియాకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కీర్తి సురేష్‌ను ఫైనల్‌ చేయలేదు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

ప్రముఖ మీడియా సంస్థ కీర్తి సురేష్‌ను ఈ విషయమై అడిగేందుకు ప్రశ్నింగా ఆమె నవ్వుతూ సమాధానం దాటవేసిందట. అంటే ఇప్పటికే రాజమౌళి ఆమెను సంప్రదించి ఉంటాడు అనిపిస్తుంది. రాజమౌళి సినిమాలో ఓకే అయ్యి, అగ్రిమెంట్‌ అయ్యే వరకు బయటకు చెప్పకూడదనే ఒప్పందం కారణంగానే ఆమె మౌనం పాటించి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జక్కన్న మల్టీస్టారర్‌ చిత్రంలో కీర్తి సురేష్‌ ఫైనల్‌ అయినట్లే అనిపిస్తుంది. అయితే మల్టీస్టారర్‌లో నటిస్తున్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లలో ఎవరికి జోడీగా ఈమె కనిపిస్తుందనేది చూడాలి. ఇద్దరిలో ఎన్టీఆర్‌కు జోడీగా కీర్తి అయితే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.