జూనియర్‌ ఆర్టిస్ట్‌ చిల్లర వేషాలు…దొరికాక…!

Juniour Artist P Krishna Sentenced To 27 Days Jail

సామూహిక నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చిన యువతులను సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో రికార్డింగ్‌ చేసిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ కు కోర్టు 27 రోజుల జైలు శిక్ష విధించినట్లు సమాచారం. గత నెల 23న సామూహిక గణేష్‌ నిమజ్జనం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా షీ–టీమ్స్‌ను రంగంలోకి దింపారు.

ganesh-nimarganam

ఈవ్‌ టీజర్లకు చెక్‌ పెట్టేందుకు 100 షీ–టీమ్‌ బృందాలను వివిధ ప్రాంతాల్లో మోహరించారు. ఆ సమయంలో ట్యాంక్‌బండ్‌ పై యువతులను వెకిలి చేష్టలతో వేధిస్తున్న మీర్‌పేటకు చెందిన జూనియర్‌ ఆర్టిస్ట్‌ పి.కృష్ణను షీ-టీమ్ బృందాలు పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. దీంతో సదరు ఆర్టిస్ట్ కి న్యాయస్థానం 27 రోజుల జైలు శిక్ష అలాగే రెండు రోజుల పాటు సామాజిక సేవ చేసేలా శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది.

jail