జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్న ఘటనలు ఏమో కానీ చెప్పిన పని మర్చిపోయి విమర్శల పాలయిన సందర్భాలు మాత్రం అనేకం అని చెప్పొచ్చు.తాను తీసుకున్న సమస్యలకు ఆవేశంలో ఏదేదో అప్పటికప్పుడు చెప్పేస్తారు.న్యాయం జరిగేలా చూస్తా అంటారు కానీ చివరికి మాత్రం పక్కన పెట్టేస్తారు.అలా ఇప్పుడు ఓ కీలకమైన సమస్యను తానేదో ఉద్ధరిస్తాన్నట్టుగా బిల్డప్ ఇచ్చి పక్కన పెట్టేసారు.
అదే సుగాలి ప్రీతీ భాయి హత్యా ఘటన కేసు.గత రెండేళ్ల నుంచి న్యాయం దొరకని ఈ కేసుకు సంబంధించి చివరగా న్యాయం కోసం పోరాడుతున్న తల్లి పవన్ ను ఆశ్రయించగా అప్పటికప్పుడు గట్టిగానే రియాక్ట్ అయ్యి న్యాయం జరిగేలా చెయ్యాలి అని వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశారు.అంతే కాకుండా ముఖ్యంగా ఈ కేసుపై అసెంబ్లీలో కొడాలి నాని బ్రదర్స్ మాట్లాడి తీరాలని గట్టిగానే డిమాండ్ చేసారు.
ఒకవేళ వారు అలా ప్రస్తావించని పక్షంలో తాను విశాఖలో ఇసుక కొరత బాధితుల కోసం చేసిన లాంగ్ మార్చ్ లాంటిదే ఈసారి సీమ ప్రాంతంలోనే ఈ జనవరి నెలలో చేస్తానని హెచ్చరించారు.కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ లాంగ్ మార్చ్ కాస్తా ఎక్కడికి పోయిందో తెలీదు.మధ్యలో బీజేపీతో కలిసి వేరే మార్చ్ ఏదో అంటున్నారు.ఇలా మొత్తానికి మాత్రం తన నైజాన్ని మళ్ళీ బయటపెట్టుకున్నారు.