తమిళ సినిమా పరిశ్రమలోని ప్రముఖ దర్శకులలో పా రంజిత్ ఒకరు. అట్టకత్తి, మద్రాస్, కబాలీ, కాలా వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షకులని అలరించిన పా రంజిత్ ఇప్పుడు బాలీవుడ్ ఆరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. బిర్సా ముండా జీవిత నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంజిత్ సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన తండ్రి పాండురంగన్ (63) ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆయన మృతికి పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈరోజు సాయంత్రం పాండురంగన్ సొంత ఊరు తిరువల్లూన్ జిల్లాలోని కరలపక్కమ్లో పాండురంగన్ అంత్యక్రియలు జరపనున్నట్టు సమాచారం. పాండురంగన్ కొద్ది రోజులుగా చెన్నైలోని అపోలో హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ వస్తున్నారు. ఆరోగ్యం ట్రీట్మెంట్కి సహకరించకపోవడంతో ఈ తెల్లవారు జామున 2 గంటలకి కన్నుమూశారు.