అర్జున్‌ రెడ్డికి మించిన రొమాన్స్‌!

Kabir Singh is the title of Shahid Kapoor

విజయ్‌ దేవరకొండకు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈస్థాయి క్రేజ్‌ ఉంది అంటే అది ఖచ్చితంగా అర్జున్‌ రెడ్డి చిత్రం వల్లే అనే విషయం ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. అర్జున్‌ రెడ్డి అనే చిత్రం వచ్చి ఉండక పోతే విజయ్‌ దేవరకొండ గురించి పెద్దగా ఏ ఒక్కరికి తెలిసేది కాదు. ఇండస్ట్రీలో వరకు ఆయన గురించి మాట్లాడుకునే వారు. ఆ తర్వాత కొంత కాలంకు ఆయన గురించి పూర్తిగా మర్చిపోయేవారు. కాని అర్జున్‌ రెడ్డి వల్ల తెలుగు రాష్ట్రాల్లోని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరు సినీ ప్రేక్షకులకు తెలిసి పోయాడు. అద్బుతమైన క్రేజ్‌ను దక్కించుకున్నాడు. అర్జున్‌ రెడ్డి చిత్రంలో విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే రొమాన్స్‌ ఏ స్థాయిలో సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ చిత్రం తమిళం మరియు హిందీల్లో రీమేక్‌ అవుతున్న విషయం తెల్సిందే.

తమిళంలో పెద్దగా అంచనాలు అయితే లేవు కాని, హిందీలో తెరకెక్కుతున్న అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రం అర్జున్‌ రెడ్డి మ్యాజిక్‌ ను రిపీట్‌ చేస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ రీమేక్‌లో ప్రముఖ హీరో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నాడు. ఇక హీరోయిన్‌గా ముద్దుగుమ్మ కియారా అద్వానీ నటిస్తోంది. వీరిద్దరి మద్య రొమాంటిక్‌ సీన్స్‌ మరింత ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. తెలుగులో తెరకెక్కించిన సందీప్‌ వంగా అక్కడ కూడా దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ఆ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్జున్‌ రెడ్డిని రొమాన్స్‌లో బీట్‌ చేయబోతున్న కబీర్‌ సింగ్‌ సక్సెస్‌లో కూడా బీట్‌ చేస్తుందేమో చూడాలి.