వినయ విధేయ రామ కొత్త పోస్టర్ – రామ్ చరణ్ ట్రెడిషనల్ లుక్

Mega Powerstar Ram Charan

మెగా హీరో రామ్ చరణ్ ఈ మధ్య చేస్తున్నవన్నీ విభిన్నమైన సినిమాలే. కమర్షియల్ పోకడలకు పోకుండా, కథకు ప్రాధాన్యమిచ్చి చేసిన సినిమాలు ధృవ మరియు రంగస్థలం మంచివిజయాన్ని సాధించిపెట్టాయి. అంతేకాకుండా, రంగస్థలంలో రామ్ చరణ్ నటనకి ఎన్ని మార్కులు పడ్డాయంటే సినిమాలో చిట్టి బాబు మాత్రమే కనిపించాడు తప్ప రామ్ చరణ్ ఎక్కడా కనపడలేదు అని అభిమానులు, విమర్శకులు చేసిన ప్రసంశలు అన్నీ ఇన్నీ కావు. ఇక ప్రయోగాత్మక చిత్రాల నుండి కాస్త విరామం తీసుకొని, మెగా అభిమానులని అలరించడానికి మాస్ డైరెక్టర్ గా పేరుగాంచిన బోయపాటి శ్రీను తో జతకట్టి ఒక మాస్ మసాలా సినిమాకి సిద్ధం అయ్యాడు. జయ జానకి నాయక సినిమా నుండి పొడవాటి తెలుగు పేర్లను పెట్టడం ప్రారంభించిన బోయపాటి శ్రీను ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకి కూడా ‘వినయ విధేయ రామ’ అని టైటిల్ పెట్టాడు.

వినయ విధేయ రామ కొత్త పోస్టర్ - రామ్ చరణ్ ట్రెడిషనల్ లుక్ - Telugu Bullet

కార్తీక పౌర్ణమి పర్వదినంని పురస్కరించుకొని సినిమా టీం ఈరోజున కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సంప్రదాయమైన తెలుపు వస్త్రాల్లో భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు లుక్ కి పోటీ ఇస్తున్నట్లుగా ఉంది రామ్ చరణ్ లుక్. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, తమిళ నటుడు ప్రశాంత్ ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డి.వి.వి ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు.

image.png