ఆ టైమ్ వచ్చినప్పుడు చెప్తానన్న కాజల్…!

Kajal-Aggarwal-Opens-Up-On-

కాజల్ అగర్వాల్ తెలుగు తమిళంలో హీరోయిన్ నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో కాజల్ అగర్వాల్ కి మంచి ఫాన్స్ ఫాలోయింగ్ కూడా ఉన్నది. ఇక్కడ దాదాపు గా ఇండస్ట్రీస్ లోని అగ్ర హీరోస్ సరసన నటించింది. తమిళంలో విజయ్, అజిత్, వంటి స్టార్ హీరోస్ సరసన నటించింది. ఆ మద్య కొంత కాలం తెలుగులో సినిమా ఛాన్స్ రాకపోవడంతో కాజల్ పని అయిపోయింది అనుకున్నారు. అయితే ఆమె మాత్రం తన జోరును కొనసాగిస్తూనే ఉంది.తాజాగా కాజల్ అగర్వాల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. డైరక్టర్ నా పాత్రకు ఈ సినిమాలు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సు వస్తుందని నమ్ముతున్నాను.

kajal-wedding

తమిళంలో రీమేక్ గా చేసే క్వీన్ చిత్రం కూడా ప్రత్యేకమైన గుర్తింపువస్తుంది. అన్నారు. అలాగే శంకర్ దర్శకత్వంలో భారతీయుడు చిత్రానికి సీక్వెల్ లో ఛాన్స్ దక్కినందుకు చాలా సంతోషం గా ఉన్నది త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. తెలుగు లో కూడా ఇంకో రెండు సినిమాలు చెయ్యవలిసి ఉన్నది అన్నారు. ఇంకా మ్యారేజ్ ఎప్పుడు అని అడిగితే మాత్రం ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేదు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను అంటూ కాజల్ క్లారిటీ ఇచ్చింది. చేతినిండా సినిమాలు ఉండటంతో ఫుల్ బిజీగా ఉన్నాను అన్నారు.