మూడేళ్ల వరకు నో మ్యారేజ్ అంటున్న అందాల భామ

మూడేళ్ల వరకు నో మ్యారేజ్ అంటున్న అందాల భామ

కాజల్ అగర్వాల్ వయసు 30 దాటి చాలా ఏళ్లయింది. అయినా అమె పెళ్లి జోలికి వెళ్ళడం లేదు. కెరీర్ మధ్యలో కొంచెం నెమ్మదించడంతో ఆమె ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఆమె కెరీర్ గాడిలో పడింది. చేతిలో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకో మూడేళ్ల వరకు ఆమె బిజీగానే ఉంటుంది. కెరీర్ నెమ్మదించినప్పుడే పెళ్లి చేసుకోని కాజల్.. వరుస ప్రాజెక్ట్స్ ఉంటే ఎలా చేసుకుంటుంది.

అందుకే ఆ విషయాన్ని కొద్దిగా పక్కనబెట్టి సినిమాల మీదే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇక పెళ్లి ప్రస్తావన వస్తే ఎప్పటిలాగే రొటీన్ ఆన్సర్ ఇచ్చింది. నిన్న విశాఖలో ఒక షో రూమ్ కార్యక్రమానికి వెళ్లిన ఆమె పెళ్లి గురించి మీడియా అడిగేసరికి నచ్చినవాడు దొరికితే చేసుకుంటాను అంటూ సమాధానమిచ్చింది.

ఇకపోతే ప్రస్తుతం ‘క్వీన్, ఇండియన్-2, ముంబై సాగా, కాల్ సెంటర్’ అనే సినిమాల్లో నటిస్తున్న ఈమె తమిళం, హిందీ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.