ఆంధ్రప్రదేశ్ లో దిశ వంటి చట్టాలు తెచ్చినప్పటికీ.. కామాంధుల విపరీత చేష్టలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా కాకినాడలోని ఓ ప్రాంతంలో నివసించే బాలికను పైఅంతస్తులో ఉండే యువకుడు బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ లాక్డౌన్ సమయంలో కూడా కామాంధులు పెట్రేగి పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆడది కనిపిస్తే చాలు ఎత్తుకెళ్లి రేప్ లకు పాల్పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో మైనర్ బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నగరంలోని ఓ ప్రాంతంలో ఒకే ఇంటిలో కింది భాగంలో ఓ కుటుంబం.. పై అంతస్తులో ఒక యువకుడు నివాసముంటున్నారు. ఆ దంపతులకు ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. తాజాగా భార్యాభర్తలు ఇద్దరూ పనుల కోసం బయటకు వెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి వారి కుమార్తె నీరసంగా కనిపించింది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ఆరా తీస్తే.. పై అంతస్తులో ఉండే ఎద్దు గణేష్(25) తనపై చెడు చేష్టలకు పాల్పడ్డాడని ఆ చిన్నారు చెప్పింది.. దీంతో వెంటనే వారు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా పోలీసులు ఆ చిన్నారిని వెంటనే వైద్య పరీక్షలు చేసేందుకు జీజీహెచ్‌కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఎద్దు గణేష్ అనే అతడు కాకినాడలోని ఓ ప్రైవేటు స్కూల్లో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు గతంలో జీజీహెచ్‌లో ఔట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న నర్సును ప్రేమించి లైంగికంగా వేధించినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. అంతేకాకుండా వీరిద్దరికి ఓ సంతానం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తనను మోసం చేసినట్లు గణేశ్‌పై గతంలో ఆ నర్సు కేసు కూడా పెట్టడం విశేషం.