రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి (Kalki2898AD). జూన్ 27, 2024 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో దీపికా పదుకునే, దిశా పటాని లు కథానాయికలు గా నటిస్తుండగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ మూవీ నుండి సర్ప్రైజ్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది. ఈ సర్ప్రైజ్ కు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. వైజయంతీ మూవీస్ పతాకం పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ప్రచార మూవీ ల తో మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Darlings, miku oka chinna surprise
Stay tuned to @Kalki2898AD
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 30, 2024