షాకింగ్ ప్రకటన చేసిన కమల్

కమలహాసన్ నాలుగున్నర దశాబ్దాల సినిమా జీవితానికి గుడ్ బై చెపుతున్నట్లు ప్రకటించాడు. కమల్ హసన్ భాష బేధం లేకుండా సినిమాలో నటిస్తూ మంచి గుర్తింపు తెచుకున్నారు. పూర్తి స్థాయి రాజకియనాకుడిగా మారబోతున్నారు అందుకనే సినిమాలు స్వస్తిపలికారు. ఇదివరకే కమలహాసన్ స్వంతగా పార్టీని స్థాపించినా సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళ రాజకీయాలు అంతగా బాగా లేవు అందుకనే ఇదే కరెక్ట్ టైం అని తమిళ రాజకియలో ముఖ్యపాత్రను పోషినచడానికి సిద్దం అవ్వుతున్నాడు. త్వరలో శంకర్ డైరక్షన్లో భారతీయుడు 2 చిత్రంలో నటించేందుకు సిద్దం అవ్వుతున్నాడు. ఈ చిత్రం భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్నది. ఈ చిత్రంను ఇప్పటి రాజకీయ మరియు ప్రజల సమస్యలను చిత్ర రూపంలో చూపించి తన రాజకీయ ఆరంగేట్రంకు ఉపయోగించుకోవాలి అని కమల్ హసన్ చూస్తున్నాడు.

ఈ చిత్రం వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు లోకనాయకుడు. ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తున్నది. ఈ చిత్రం పూర్తైన తరువాత పూర్తిస్తాయి రాజకీయ నాయకుడిగా జీవించేందుకు సిద్దం అవ్వుతున్నాడు. అంటే కథానాయకుడి పాత్రకు ఇక గుడ్ బై చెప్పినట్లే, సూపర్ స్టార్ రజినీకాంత్ కు పోటిగా సినిమాలు తీస్తూ తనదైనా స్టైల్ లో నవ్విస్తూ, ఏడిపిస్తూ నవరసాలను పండించినా లోకనాయకుడు సినిమాలకు దూరం అవ్వుతుందటంతో కమల ఫాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. సో ఎదిఎమైన పోలటికల్ ఎంట్రీ తప్పదు అంటున్నాడు కమల్ హసన్