హిందీలో సూపర్ సక్సెస్ అయిన బిగ్‌బాస్‌ను తెలుగు మరియు తమిళంలో గత సంవత్సరం నుండి ప్రారంభించిన విషయం తెల్సిందే. గత సంవత్సరం రెండు భాషల్లో కూడా కాస్త అటు ఇటుగానే ప్రారంభించారు. ఈసారి కూడా తెలుగులో ప్రారంభం అయిన వారం రోజులకు తమిళంలో ప్రారంభం అయ్యింది. తెలుగు మరియు తమిళ భాషల్లో బిగ్‌బాస్ షో ఆసక్తికరంగా సాగుతుంది. ఇలాంటి సమయంలో తమిళ బిగ్‌బాస్ షోకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సౌత్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారు ఆందోళనకు దిగుతున్నారు. తాము ఉండగా ఈ షో కోసం ముంబయి నుండి ఎంప్లాయిస్ను తీసుకు రావడం ఏంటని, తమకు అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం అంటూ ఆందోళనకు దిగేందుకు సిద్దం అవుతున్నారు.
వారం రోజుల్లో షోకు మా ఫెడరేషన్ నుండి 50 శాతం ఎంప్లాయిస్ను తీసుకోని పక్షంలో షోను అడ్డుకుని తీరుతాం అని, ఖచ్చితంగా షో కోసం వేసిన సెట్స్‌కు వెళ్లి ఆందోళన నిర్వహిస్తాం అంటూ వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ నిర్వాహకులు కాస్త టెన్షన్ పడుతున్నారు. గత సీజన్ సమయంలో కూడా ఇదే విధంగా పరిస్థితి ఏర్పడటం జరిగింది. ఆ సమయంలో ఫెడరేషన్ కోరినట్లుగా కొందరు ముంబయి ఎంప్లాయిస్ను తీసేని చెన్నై ఎంప్లాయిస్ను తీసుకోవడం జరిగింది. ఈసారి కూడా 50 శాతం కనీసంగా తమిళ ఎంప్లాస్కు ఛాన్స్ ఇవ్వాల్సిందే అంటూ ఫెడరేషన్ వారు కోరుతున్నారు. త్వరలోనే వారు కోరినట్లుగా వారిని తీసుకునే అవకాశం ఉంది. లేదంటే బిగ్‌బాస్ షోను అడ్డుకునే అవకాశం కూడా ఉంది..