షూటింగ్ పూర్తి చేసుకున్న కమల్ హాసన్ థగ్‌ లైఫ్‌

Kamal Haasan Thug Life
Kamal Haasan Thug Life

కమల్‌ హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘థగ్‌ లైఫ్‌’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. ఇటీవల చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా షూటింగ్ పూర్తి అయిందని ప్రకటించారు. అంతే కాకుండా సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. తమిళ, తెలుగు, హిందీ ఇంకా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు గాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా రూ.150 కోట్లకు రైట్స్ ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. కమల్‌ నటించిన ఏ సినిమాకు ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. థగ్ లైఫ్ కి ఉన్న క్రేజ్ ఏంటి అనేది ఈ లెక్కలు చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.

36 సంవత్సరాల క్రితం కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబినేషన్ లో ‘నాయగన్‌’ సినిమ వచ్చింది. తెలుగు లో నాయకుడుగా డబ్ అయిన ఆ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి కొన్ని కారణాల వల్ల మణిరత్నం, కమల్‌ హాసన్ ల కాంబినేషన్ లో సినిమాలు రాలేదు. 36 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పైగా మణిరత్నం గత చిత్రం పొన్నియిన్‌ సెల్వం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమా రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేయడం కన్ఫర్మ్‌ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో థగ్‌ లైఫ్‌ ను దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్నారు.

కమల్‌ హోం బ్యానర్‌ రాజ్ కమల్‌ ఇంటర్నేషనల్ తో కలిసి మద్రాస్ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. న్యూ ఢిల్లీతో పాటు పలు విభిన్నమైన షెడ్యూల్స్ తో చిత్రీకరించిన ఈ సినిమాను ఇదే ఏడాది డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.