Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మరీ అరాచకంగా ఉండేవాళ్లతో తప్ప ఎవరితోనైనా నేను సఖ్యంగానే ఉంటా.. ఇది పార్టీ మారుతున్నారన్న ప్రశ్నలకు ఏపీ మంత్రి కామినేని ఆన్సర్. కామినేని శ్రీనివాస్ పేరుకు బీజేపీలో ఉన్నా.. టీడీపీ సర్కారును టీడీపీ మంత్రుల కంటే బాగా వెనకేసుకొస్తారన్న అభిప్రాయం బీజేపీలోనే కాదు టీడీపీలో కూడా ఉంది. కామినేనిని చూసి సహచర మంత్రులు కూడా టెన్షన్ పడటానికి కారణం ఇదే.
ఇటు చంద్రబాబుతో అటు పవన్ తో కూడా కామినేనికి మంచి దోస్తీ ఉంది. ఇటీవల జరిగిన పవన్ బాబు మీటింగులకు అనుసంధానకర్త ఆయనే. పవన్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఎప్పుడూ దాచుకోవడానికి ప్రయత్నించలేదు. అందరితోనూ సాన్నిహిత్యంగానే ఉంటామని, కానీ జీవితాంతం బీజేపీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు కామినేని
తనకు రాజకీయాల్లో ఇంతటి స్థానం రావడానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే కారణమని, ఆయన మార్గంలోనే నడుస్తానని చెప్పారు కామినేని. కామినేని మాటలు విన్నాక బీజేపీకి కాస్త టెన్షన్ తగ్గినా.. ఏమూలో అనుమానం మాత్రం అలాగే ఉంది. వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు కాలం కలిసొస్తే కామినేని హైజంప్ చేస్తారని నేతలు గుసగుసలాడుతున్నారు.
మరిన్ని వార్తలు: