బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్, వివాదాల బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్‌గా రికార్డుకెక్కింది. ఏ అంశమైన తనదైన స్టైల్లో ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది. అయితే బీటౌన్ నటి, నిర్మాత ఏక్తా కపూర్ ఎంతో మంచి వ్యక్తి అని కంగనా అభిప్రాయపడింది. ఏక్తా కపూర్ నిర్మిస్తోన్న రియాల్టీ షో లాక్ అప్‌కి కంగనా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ ఇంటర్వ్యూలో కంగనా ‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు అంతగా పరిచయాలు లేకపోవడంతో అందరూ నన్ను ఏడిపించేవారు. ఇంగ్లీష్ మాట్లాడటం రాదని, కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు. ఇంకా కొందరైతే ఇండస్ట్రీ నీ లాంటి వారి కోసం కాదు, ఇక్కడి నుంచి వెళ్లిపో అని నా ముఖంపైనే చెప్పేవారు. కానీ, నా నిర్మాత ఏక్తా కపూర్ అలా అన్లేదు. నా కెరీర్ స్టాటింగ్ టైంలో ఆమెతో కలిసిపనిచేశాను. ఆమె చాలా మంచి వ్యక్తి. నాకు ఫస్ట్ హిట్‌ను ఇచ్చింది కూడా ఆమె. నాకు ఎప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నారు.’ అని తెలిపింది.