ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్‌ల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో జాతీయ స్థాయిలో తెరకెక్కించిన తలైవి సినిమాపై అందరి దృష్టి పడింది. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. జయలలితగా కంగనా అదరగొట్టేశారు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్లు, ట్రైలర్లు తెగ వైరల్ అయ్యాయి.మామూలుగా అయితే తలైవి సినిమా ఇప్పటికే విడుదలై ఉండాల్సింది.
సెకండ్ వేవ్ కారణంగా అన్ని ప్లాన్స్ తారుమారు అయ్యాయి. ఏప్రిల్ 23న తలైవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్స్ వేశారు. కానీ కరోనా వల్ల అంతా మారిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సినిమాలు విడుదల చేసేందుకు మేకర్స్ ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలో తలైవి సినిమా అప్టేట్ వచ్చింది. తలైవి తమిళ వర్షెన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ సర్టిఫికెట్ ఇచ్చారు.
అయితే త్వరలోనే ఇతర భాషలకు సంబంధించిన సెన్సార్ కూడా పూర్తి చేసేస్తారని తెలుస్తోంది. ఆగస్ట్‌లో ఈ మూవీని థియేటర్లో విడుదల చేసేందుకు భారీ ప్లాన్లు వేస్తున్నారట. విబ్రి మీడియా, జీ స్టూడియో సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య తలైవి ట్రైలర్ ఈవెంట్లో కంగనా కన్నీరు కార్చడం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.