గెహ్రియాన్‌పై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

గెహ్రియాన్‌పై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

దీపిక పదుకొణె నటించిన తాజా చిత్రం గెహ్రియాన్‌పై బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలోని శృతిమించిన రొమాన్స్‌పై ఆమె ఘాటుగా స్పందించింది. ‘నేను కూడా ఈ తరానికి చెందిన వ్యక్తినే. కానీ ఇలాంటి రొమాన్స్‌ని అర్థం చేసుకోగలను.

దయచేసి కొత్తతరం యువత, అర్భన్‌ సినిమాల పేరుతో ఇలాంటి చెత్తను అమ్మకానికి పెట్టకండి. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలుగానే ఉంటాయి. స్కిన్ షో, అశ్లీలత వంటివి చెత్త సినిమాల‌ను ఏమాత్రం కాపాడలేవు’ అంటూ ఇన్‌స్టా వేదికగా విమర్శలు గుప్పించింది.

ప్రస్తుతం కంగనా చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇందులో సిద్ధాంత్ చతుర్వేదితో దీపిక‌ ఇంటిమేట్‌ సీన్లలో రెచ్చిపోయిందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లి తర్వాత దీపికా ఇలాంటి సీన్స్‌ చేయడం ఏంటంటూ పెదవివిరుస్తున్నారు.