బాలయ్య మీద కంగనా సెటైర్లు !

Kangana sensational comments on balakrishna

పుండు మీద కారం చల్లడం అంటే ఇదేనేమో. అసలే ఎన్టీఆర్ బయోపిక్ మూవీస్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల ఓటమి భారంతో ఉన్న బాలయ్య, క్రిష్‌ల పై సమయం చూసి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఆమె లీడ్ రోల్‌ లో నటించిన ‘మణికర్ణిక’ సినిమా విషయంలో డైరెక్టర్ క్రెడిట్స్ విషయంలో క్రిష్-కంగనా మధ్య రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. సినిమా మొత్తం తను పూర్తి చేస్తే కంగనా వేలు పెట్టి చెడగొట్టిందని క్రిష్ ఆరోపిస్తే.. క్రిష్‌కి అంతసీన్‌లేదని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది కంగనా. ఈ ఇద్దరి మధ్య డైరెక్టర్ క్రెడిట్ విషయంలో వివాదం రంజుగానే సాగింది.

తాజాగా టైం చూసి మహానాయకుడు విషయంలో చిత్ర దర్శకుడు క్రిష్‌పై సెటైర్లు వేసింది కంగనా. ‘మణికర్ణిక చిత్ర క్రెడిట్‌ను నేను కొట్టేశానంటూ చాలా మంది నోటికొచ్చినట్టు మాట్లాడారని ఇప్పుడు ఏమైంది? మణికర్ణిక సినిమాను ఇంకా బాగా తీసేవాడిని కంగనా చెడగొట్టిందని క్రిష్ అన్నారు. అంత బాగా తీసే టాలెంట్ ఉన్న క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎందుకు హిట్ చేయలేకపోయారు ? ఎన్టీఆర్ బయోపిక్‌ మూవీతో దర్శకుడు క్రిష్ బాలకృష్ణకు చాలా ద్రోహం చేశారు. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్‌కి ఒక మచ్చలా మిగిలింది. క్రిష్‌ని నమ్మినందుకు బాలయ్యను చూస్తుంటే చాలా జాలిగా ఉందంటూ సైటైర్లు వేసింది కంగనా.