Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అన్నిటినీ తుంగలో తొక్కుతున్న కేంద్రం తాజాగా కడప ఉక్కు ఫ్యాక్టరీ ఆలోచనకు కూడా మంగళం పాడే చర్యలు తీసుకుంది. విభజన చట్టం అమలుకు సంబంధించి సాగుతున్న కేసులో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదన్నట్టు అంతకు ముందు వచ్చిన నివేదికనే సుప్రీమ్ కోర్ట్ కి అందజేసింది. ఆ పాత రిపోర్ట్ తర్వాత చర్యలతో కడపలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యమే అని మెకాన్ సంస్థ ప్రతినిధులు చెప్పిన విషయం మీద కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఒక్క సమావేశం కూడా జరపలేదు. మెకాన్ నివేదిక పక్కనబెట్టి సుప్రీమ్ కి అఫిడవిట్ ఇవ్వడంతోనే కేంద్రం ఉద్దేశం ఏంటి అనేది అర్ధం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ కి ఏ ఒక్క హామీ నెరవేర్చకూడదని పంతం పట్టి కూర్చున్న కేంద్రాన్ని ఒక్క మాట అనలేకపోతున్న రాష్ట్ర బీజేపీ నేతల అసమర్ధతను అర్ధం చేసుకోవచ్చు. అయితే ఆ అసమర్ధత బయటపడకుండా చూసుకునేందుకు బీజేపీ నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎంత దిగజారి మాట్లాడుతున్నారో ఓ సారి చూద్దాం.
కేంద్రం మీద ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న వ్యతిరేకతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అన్న విషయం మరిచిపోయిన బీజేపీ, కేవలం చంద్రబాబు, మీడియా ప్రచారం వల్లే ఇదంతా జరుగుతోందన్న భ్రమల్లో వుంది. ఆ విధంగా ఆంధ్రుల విచక్షణని తక్కువ అంచనా వేసి ప్రతి విమర్శకు వెంటనే సమాధానం ఇవ్వమన్న అమిత్ షా, మోడీ మాటలు పట్టుకుని రంగంలోకి దిగిపోయారు కన్నా. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకి సంబంధించి కేంద్రం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పుకొచ్చిన కన్నా ఈ విషయంలో తప్పంతా రాష్ట్రానిదే అట. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అట. అంటే వాళ్ళు ఇవ్వనన్నా దానికి ఒప్పించలేకపోలేకపోయారని రాష్ట్రం మీద పడుతున్న కన్నా లాంటి వాళ్ళ ని చూస్తుంటే జనం రక్తం సలసల కాగుతోంది. ఇలాంటి పార్టీని నమ్మి 2014 లో ఓట్లు వేసినందుకు వాళ్ళు పచ్చాత్తాపపడుతున్నారు. ఈ ప్రభావం ఎలా ఉంటుందో 2019 ఎన్నికల్లో అర్ధం అయ్యాక గానీ కన్నా లాంటి బీజేపీ నాయకుల నోళ్లు మూతపడవు.