Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక్రం, రాష్ట్ర పాలిటిక్స్ లో ప్రాధాన్యం …ఇది మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీపి గతం. రాష్ట్ర విభజనతో అంతా తారుమారు అయిపోయింది. ఓ వైపు తాను అసెంబ్లీ సహా అన్ని వేదికలపై విమర్శనాస్త్రాలు సంధించిన చంద్రబాబు సీఎం అయ్యారు. వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది. దీంతో మాస్టర్ ప్లాన్ వేసిన కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో మోడీ ప్రభ చూసి తెలివిగా బీజేపీ గొడుగు కిందకి వెళ్లిపోయారు. బీజేపీ లో చేరడం ద్వారా చంద్రబాబు కన్ను తన మీద పడకుండా జాగ్రత్తపడ్డారు. నిజంగానే కన్నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. కన్నా మీద ప్రతీకారం కోసం బీజేపీ తో గొడవ పడడం ఎందుకని చంద్రబాబు కూడా చూసీచూడనట్టు పోయారు.
మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ళలో బీజేపీ నీడలో నుంచి చంద్రబాబు మీదకి పరోక్ష అస్త్రాలు చాలా సంధించారు కన్నా. బీజేపీ, టీడీపీ మధ్య ఇప్పుడున్న పరస్పర అపనమ్మకానికి కన్నా కూడా ఓ కారణం. ఎన్ని చేసినా కన్నా కి ఓ విషయం అర్ధం అయిపోయింది. బీజేపీ కి ఏపీ లో రాజకీయ భవిష్యత్ లేదని. ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న కన్నా ప్రస్తుతం ప్రత్యామ్న్యాయం కోసం చూస్తున్నారు. వైసీపీ నుంచి ఎప్పటినుంచో ఆహ్వానం వున్నా పెద్దగా పట్టించుకోని కన్నా ఇప్పుడు ఆ విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు అధికార బాణాన్ని తట్టుకోడానికి ఇన్నాళ్లు షెల్టర్ తీసుకున్న బీజేపీ కి కన్నా త్వరలో గుడ్ బై కొట్టే అవకాశాలున్నాయి.