నిమ్మకూరులోను లక్ష్మీస్‌ దర్శకుడికి చేదు అనుభవం

kethi reddy jagadeeshwar reddy troubles from Nimmakuru Village Peoples

Posted November 14, 2017 at 19:59 
ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా కేతిరెడ్డి జగదీష్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జరగడం జరిగింది. షూటింగ్‌ కార్యక్రమాలు చేసేందుకు అనుమతి లేదు అంటూ పోలీసులు చెప్పడంతో హడావుడిగా అక్కడ పూజా కార్యక్రమాలు చేశారు. ఇక తాజాగా ఎన్టీఆర్‌ సొంత గ్రామంలో కొన్ని సీన్స్‌ను తీసుకునేందుకు దర్శకుడు కేతిరెడ్డి అండ్‌ టీం నిమ్మకూరు వెళ్లడం జరిగింది. కాని నిమ్మకూరు గ్రామ పంచాయితి పెద్దలు మాత్రం సినిమా షూటింగ్‌కు నో చెప్పారు.

Nimmakuru-village-peoples-s

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర అంటూ పిచ్చి సినిమా చేస్తున్నారని, అందుకే లక్ష్మీస్‌ వీరగ్రంధం చిత్రానికి నిమ్మకూరు గ్రామస్తులు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్స్‌ను నిమ్మకూరులో చేయాలని భావించినప్పటికి గ్రామ పెద్దలు నో చెప్పడంతో దర్శకుడు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు మరో చోట చిత్రీకరణకు ప్లాన్‌ చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా కూడా లక్ష్మీస్‌ వీరగ్రంధం చిత్రాన్ని తెరకెక్కించి తీరుతాను అంటూ దర్శకుడు కేతిరెడ్డి ధీమాగా చెబుతున్నాడు.

లక్ష్మీ పార్వతి పాత్రలో ముద్దుగుమ్మ, హాట్‌ బ్యూటీ రాయ్‌ లక్ష్మీని ఎంపిక చేయడం జరిగింది. త్వరలోనే అందుకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేయబోతున్నారు. వచ్చే సంవత్సరం ఆరంభంలోనే సినిమాను విడుదల చేయాలని కేతిరెడ్డి ప్లాన్‌. అయితే సినిమాకు మాత్రం లక్ష్మీ పార్వతి నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కాని కేతిరెడ్డి అనుమతి లేకుండానే మొదలు పెట్టాడు. ఆమె కోర్టుకు వెళ్తే సినిమా విడుదల అవ్వడం అనేది కష్టం అవుతుంది.

SHARE