కోలుకుంటున్న కపిల్‌దేవ్‌

కోలుకుంటున్న కపిల్‌దేవ్‌

భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ తాను వేగంగా కోలుకుంటున్నట్లు ప్రకటించారు. అందరి దీవెనలతో తన ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన తన ఇంటి ముందు నిలబడి రికార్డు చేసిన వీడియో ద్వారా వెల్లడించారు. గత వారం గుండెపోటుకు గురైన కపిల్‌కు యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగింది.

‘నా 83 కుటుంబానికి…వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. మీ అందరినీ కలవాలని ఉత్సాహంగా ఉన్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. మీ దీవెనలకు నా కృతజ్ఞతలు. సాధ్యమైనంత త్వరలో అందరినీ కలుసుకుంటా. ఈ ఏడాది చివరి దశకు వచ్చింది. వచ్చే ఏడాది అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా’ అని కపిల్‌ అన్నారు.