బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ అంటే తెలియను వారు ఉండరు. ఎన్నో సూపర్ హిట్ట్ చిత్రాలను అందించాడు. బాహుబలి సినిమాను హిందీలో ధర్మేంద్ర ప్రొడక్షన్ పైన ఈయనే విడుదల చేశాడు. ఆ సినిమా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. అప్పటి నుండి కరణ్ మనసు లో ప్రభాస్ తో డైరక్ట్ గా హింది లో ఓ సినిమా తీయాలని పడింది. కానీ ప్రభాస్ కు ఉన్న కమిట్ మెంట్స్ వలన కరణ్ తో సినిమా చెయ్యడం కుదరలేదు. కానీ కరణ్ మాత్రం ఎలాగైనా ఓ సౌత్ హీరో తో సినిమా తీస్తాను అని బిష్మించుకు కూర్చున్నాడు. ఇప్పుడు ఆ అదృష్టం విజయ్ దేవరకొండ కు దక్కింది. ఆర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాల, సినిమాతో సౌత్ ఇండియన్ హీరో గా మారిపోయాడు. సౌత్ లో విజయ్ కు ఉన్నా క్రేజీ ని దృష్టిలో పెట్టుకొని విజయ్ తో కరణ్ ఓ సినిమా చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నాడు.
ఈ మద్య కరణ్ విత్ కాఫీ షో లో శ్రీదేవి కూతురు కూడా విజయ్ దేవరకొండ తో ఓ సినిమా లో నటించాలి అని ఉన్నది అని చెప్పింది. కరణ్ కూడా సౌత్ ఇండియా సెక్సీ హీరో అని కితాబు ఇచ్చాడు కూడా, టాక్సీ వాల విడుదలకు ముందు ఒక ఫంక్షన్ లో కరణ్ జోహార్ తో ఓ సినిమా చేస్తానని చెప్పాడు. అంటే VD బాలీవుడ్ లో తన సత్తా ఏమిటో చూపించడానికి రెడీ అవ్వుతున్నాడు. ఈ మద్యనే ముంబాయి లోని కరణ్ ఆఫీస్ వెళ్లి బాలీవుడ్ లో తను చెయ్యబోయే సినిమా గురుంచి డిస్కషన్ కూడా చేసినట్టు ఫిల్మ్ నగర్ లో ఓ టాక్ వినపడుతుంది. మన తెలుగు నుండి బాలీవుడ్ కు చాలా మంది వెళ్లి తమ అదృష్టం ను చెక్ చేసుకున్నారు. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. మరి VD ఎలాంటి ఫలితాన్ని అక్కడ అందుకుంటాడో చూడాలి.