వెంకీ మామ కు అంతా రెడీ…!

Finally Venky Mama To Start The Shoot

రియల్ లైఫ్ లో నాగచైతన్య, వెంకటేష్ మామ అల్లులు. ఇప్పుడు రీల్ లైఫ్ లో కూడా మామ అల్లులు గా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దర్శకుడు బాబీ తో వెంకి మామా చిత్రం తెరకేక్కనున్నా సంగతి తెలిసిందేగా, ఇప్పుడు ఈ చిత్రానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ చిత్రం ఇటివల పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దర్శకుడు బాబీ ఈ చిత్రాని కామెడీ ఎంటర్ టైనేర్ గా రూపొందించేందుకు సిద్దం అయ్యాడు. డిసెంబర్ 12 నుండి వెంకీ మామ రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోనున్నది.

Venky-Mama-Movie-Shootnig-U

మొదటి షెడ్యూల్ ను చెన్నై లో జరగనున్నది. మొదట ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలపైన షూటింగ్ జరుపుతారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన రాకుల్ ప్రీత్ సింగ్, వెంకటేష్ సరసన శ్రియ గాని బాలీవుడ్ బ్యూటీ హుమ్మ ఖురేషి, ని తీసుకోవాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. జై లవకుశ చిత్రం తరువాత బాబీ తీస్తున్నా ఈ చిత్రం పైన భారీ అంచనాలు ఉన్నాయి. నాగచైతన్య ప్రస్తుతం సమంతా తో మజిలి అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఇంకా మామ వెంకటేష్ ఎఫ్2 అనే మల్టీ చిత్రంలో నటిస్తున్నాడు. నాగచైతన్యకు మామ తో కలిసి వచ్చేన చూడాలి.