షాక్‌: చై, సామ్‌ల మధ్య నో రొమాన్స్‌…?

No Romantic Scenes Between Naga Chaitanya And Samantha New Movie

అక్కినేని నాగచైతన్య, సమంతలు ఇటీవలె ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘యూటర్న్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్నారు. విదేశాల్లో హాయిగా గడిపి వచ్చిన చై, సామ్‌లు తాజాగా షూటింగ్‌లో పాల్గోంటున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరి కాంభోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ‘నిన్నుకోరి’ ఫేం శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలె షూటింగ్‌లో పాల్గోంటున్న చై, సామ్‌లు ఈ చిత్రంలో భార్యభర్తలుగా కనిపించబోతున్నారు. భార్య భర్తల బంధం గురించి ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నారు.

No-Romantic-Scenes-Between-

ఇది ఒక ఎమోషనల్‌ డ్రామా. ఫ్లాష్‌బ్యాక్‌లోని కొన్ని పాటలలో తప్పితే ఇద్దరి రొమాన్స్‌ ఎక్కడా ఉండదు. సినిమా మొత్తంలో కూడా ఈ ఇద్దరు హగ్‌ చేసుకోరు. క్లైమాక్స్‌ సీన్‌లో మాత్రమే చై, సామ్‌లు హగ్‌ చేసుకుంటారు. ఈ చిత్రంలో రొమాన్స్‌ లేకుండా కేవలం ఎమోషన్‌తో సాగే విధంగా రూపొందిస్తున్నట్టు చిత్ర యూనిట్‌ వర్గాల నుండి సమాచారం అందుతోంది. చై, సామ్‌లు కలిసి నటించిన ‘మనం’ చిత్రం సక్సెస్‌లో భాగం చై, సామ్‌ల రొమాన్స్‌ అని కూడా చెప్పవచ్చు. చై, సామ్‌ అనగానే ప్రేక్షకులు ఒకమంచి రొమాంటిక్‌ థ్రిల్‌ను ఊహించుకుంటారు. కానీ ఈ చిత్రంలో వీరి రొమాన్స్‌ లేకపోతే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు అనేది చూడాలి.

Naga-Chaitanya-And-Samantha