రాందేవ్ బాబా కి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్ట్…!

Supreme Court Notice To Baba Ramdev

ప్రముఖ యోగ గురు, పతంజలి బ్రాండ్ అంబాసిడర్ అయిన రాందేవ్ బాబా కి సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. రాందేవ్ బాబా జీవితం పైన “గాడ్ మాన్ తో టైకూన్” అనే పేరు తో ప్రియాంక పాఠక్ నారాయణ్ అనే రచయిత రాందేవ్ బాబా బయోగ్రఫీని రచించగా జుగరనౌట్ అనే ప్రచురణ సంస్థ ముద్రించింది. ఈ పుస్తకం గురించి స్పందించిన రాందేవ్ బాబా ఈ పుస్తకంలో అవాస్తవమైన విషయాలు ఉన్నాయని, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విషయాలు ఇందులో పొందుపరిచారనే ఆరోపణలతో రాందేవ్ బాబా ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించగా, ఈ పుస్తకాన్ని ప్రచురించడం గాని, విక్రయించడం గాని చేయరాదని హైకోర్టు సెప్టెంబర్ 29 న ఆ పుస్తక ప్రచురణ సంస్థకు ఆదేశాలను జారీ చేసింది.

ramdev-baba-pathanjali

అయితే ఈ విషయంలో తగ్గేది లేదన్న పుస్తక ప్రచురణ సంస్థ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ, సుప్రీమ్ కోర్ట్ ని ఆశ్రయించింది. ఈ విచారణను స్వీకరించిన సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనంకి చెందిన మదన్ బి లోకుర్ మరియు దీపక్ గుప్త లు రాందేవ్ బాబా కి నోటీసులు జారీ చేస్తున్నామని, తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల మొదటి వారానికి వాయిదా వేసింది.