రాజ‌కుటుంబం ఫొటోతో ల‌క్షాధికారి…

Karen Murdoch Takes Photo of Royal Family on Christmas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఒక్క ఫొటోతో ల‌క్షాధికారి కావ‌డం సాధ్య‌మేనా… వృత్తిరీత్యా ఫొటో గ్రాఫ‌ర్ అయిన‌ప్ప‌టికీ… ఒకే ఒక్క క్లిక్ మ‌నిపించి ల‌క్ష‌లు సంపాదించ‌డం అయ్యే ప‌ని కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది బ్రిట‌న్ కు చెందిన ఓ నర్స్. ఆమె తీసిన ఒక ఫొటో ఇప్పుడామెను ల‌క్షాధికారిని చేసింది. దీనికి కార‌ణం ఆ ఫొటోలో ఉన్న వీవీఐపీలే. వివ‌రాల్లోకి వెళ్తే. బ్రిట‌న్ కు చెందిన కారెన్ ముర్దోచ్ వృత్తిరీత్యా న‌ర్సు. క్వీన్ ఎలిజ‌బెత్ ఆస్ప‌త్రిలో ఆమె న‌ర్సుగా ప‌నిచేస్తోంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రాజ‌కుటుంబం నిర్వ‌హించిన పార్టీని చూడ‌డానికి అంద‌రితో పాటు ఆమె కూడా వెళ్లింది. అందరిలాగే ఆ పార్టీలో త‌న‌కు న‌చ్చిన కొన్నిఫొటోల‌ను తీసుకుంది. ఈ క్రమంలో ప్రిన్స్ విలియం, ఆయ‌న భార్య కేట్, ప్రిన్స్ హ్యారీ, ఆయ‌న‌కు కాబోయే భార్య మేగ‌న్ మార్కెల్ ను ఒకే ఫొటోలో బంధించింది. త‌ర్వాత ఆ ఫొటోను ఫ్యాబ్ ఫోర్ అని ట్విట్ట‌ర్ లో షేర్ చేసింది.

Royal-Family-at-Christmas-C

రాజ‌కుటుంబం కొడుకులు, కోడ‌ళ్లు ఒకే ఫొటోలో ప‌క్క‌ప‌క్క‌న క‌లిసి ఉన్న ఈ ఫొటో ఒక్క‌రోజులో వైర‌ల్ గా మారింది. ఆ ఫొటోను త‌మ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురించుకునేందుకు బ్రిట‌న్ కు చెందిన ప్ర‌ధాన వార్తాప‌త్రిక‌లు కారెన్ ను సంప్ర‌దించాయి. ఫొటో ఒరిజ‌న‌ల్ హ‌క్కుల‌ను కొన‌డానికి ముందుకొచ్చాయి. దీంతో ఫొటో ఖ‌రీదు నిర్ణ‌యించ‌డానికి కారెన్ ఓ ఏజెంట్ ను పెట్టుకుంది. ఈ ఫొటో ద్వారా త‌న కూతురు చ‌దువుకు కావాల్సిన డ‌బ్బు స‌మ‌కూరితే చాల‌ని కారెన్ అనుకుంటోంది. ఆమె ఏజెంట్ లెక్క‌ల ప్ర‌కారం ఈ ఫొటో ఖ‌రీదు రూ.23ల‌క్ష‌ల పైనే ప‌లికే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.