ఈ రోజు కర్నాటక సీఎం కుమారస్వామి ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇటీవలే తన వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న ఆయన కనడుర్గమ్మ దర్సనం కోసం వచ్చారు. అనంతరం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ‘హోటల్ గేట్‌వే’లో ఉదయం ముఖ్యమంత్రులిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాల చర్చకు వచ్చాయని తెలుస్తోంది. జాతీయ పార్టీలతో మరోసారి సమావేశం నిర్వహించే విషయం వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఎన్డీఏకు వ్యతిరేకంగా పని చేసే పార్టీలను కలుపుకొని వెళ్తామని బాబు చెప్పారు.
అలాగే చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, రాజధాని లేని ర్రాష్టాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కుమారస్వామి అన్నారు. అమరావతి నిర్మాణం సజావుగా జరగాలని కోరుకుంటున్నాని ఆయన చెప్పుకొచ్చారు. 17 ప్రాంతీయ పార్టీలను ఒక వేదిక పైకి తీసుకు రావడంలో చంద్రబాబు సఫలం అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు.