కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంట బెజవాడ అమ్మాయి కోడలిగా అడుగుపెట్టనున్నట్లు సమాచారం. నిన్న ఉదయం నగరానికి వచ్చిన కుమారస్వామి దుర్గమ్మను దర్శించుకుని అటు నుండి ఏపీ ముహ్యమంత్రితో భేటీ కూడా అయ్యారు. అధికారికంగా దేవీ దర్సనం కోసమే వచ్చామని చెబుతున్నా ఆయన తన కొడుకు నిఖిల్ గౌడకు పెళ్లి కుమార్తెను చూడటం కోసమే ఇక్కడకు వచ్చారని తెలుస్తోంది. విజయవాడకు చెందిన పాపులర్ షూ మార్ట్ యజమాని కోటేశ్వరరావు కుమార్తెను చూసేందుకు కుమారస్వామి సతీసమేతంగా వచ్చినట్లు చెబుతున్నారు.
ఈ వార్తలను ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావు ఖండించినప్పటికీ నిజం మాత్రమ అదేనని తెలుస్తోంది. కుమారస్వామి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని, అందుకే భోజనానికి పిలిచినట్టు ఆయన వివరణ ఇచ్చారు. కానీ కుమారస్వామి మాత్రం వీరి కుమార్తెను తమ కుమారుడికి అడగడానికే వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కోటేశ్వరరావు కుమార్తెతో నిఖిల్‌కు రెండేళ్ల క్రితమే బెంగళూరులో ఒక పెళ్ళిలో పరిచయం అయినట్టు తెలుస్తోంది ఎటూ ఆయన మూడేళ్ళ క్రితం చేసుకున్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు ఈమెని చేసుకునేందుకు సిద్డమయ్యారని తెలుస్తోంది.