Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మంత్రివర్గ విస్తరణ చర్చల్లో తలమునకలు అయి ఉన్న కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఊహించని విషాదం ఎదురైంది. రోడ్డు ప్రమాదంలో ఆ పార్టీ ఎమ్మెల్యే దుర్మరణం పాలయ్యారు. ఇటీవలి ఎన్నికలలో విజయం సాధించి గెలుపుని పూర్తిగా ఆస్వాదించకుండా దుర్మరణం చెందారు కర్నాటకకి చెందిన కాంగ్రెస్ ఎమెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ … జామఖండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమెల్యేగా బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ కులకర్ణిపై 2795 ఓట్ల మెజార్టీతో గెలిచిన భీమప్ప 15 రోజుల పాటు కర్ణాటకలొ జరిగిన హై డ్రామా నడుమున క్యాంప్ లో ఉండి స్వస్థలానికి చేరుకున్న నలభై ఎనిమిది గంటలు ముగియకుండానే రోడ్డు ప్రమాదంలో అసువులు బాశారు.
గోవా నుంచి బాగల్‌కోట్‌కు రోడ్డు మార్గం గుండా వస్తోన్న ఆయన కారు బగల్‌కోట్ సమీపంలోని తులసిగిరి దగ్గరకు రాగానే ఎదురుగా ఓ ట్రక్ వచ్చింది. డ్రైవర్ దాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన భీమప్పను ఆయన అనుచరులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు డ్రైవర్ కూడా మృతి చెందాడు. జంఖండి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన భీమప్పకు ఈ సారి మంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోన్నవేళ ఆయన మరణవార్త పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.