Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కావేరీ జల నిర్వాహక మండలి ఏర్పాటు అంశం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాజేసిన చిచ్చు మరింత పెద్దదవుతోంది. కావేరీ జల నిర్వాహక మండలిని ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ విషయం మీద తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు, సినీ రాజకీయ ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లమీదకు వస్తున్నారు. తీర్పు అమలులో కేంద్రం కావాలనే లేట్ చేస్తుందంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీంతో మే 3 నాటికి ముసాయిదాను రూపొందించి తమకు అందజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరశనలకి కోలీవుడ్ మద్దతు ఇచ్చింది, ఈ మండలి ఏర్పాటు చేయాలని సినీ నటులు కమల్‌హాసన్, రజనీకాంత్‌లు కూడా సినీ ఆర్టిస్ట్స్ అందరితో కలిసి డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ మీద కర్ణాటక చలనచిత్ర మండలి అధ్యక్షుడు గోవింద ఫైర్ అయ్యారు. కావేరీ జల నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినందుకు గాను తమిళ అగ్రనతులయిన కమల్, రజనీ చిత్రాల మీద కర్నాటక వ్యాప్తంగా నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ఒకవేళ అదే నిర్ణయం తీసుకుంటే తరువాత వారి కున్న మార్కెట్ దృష్ట్యా తమ హెచ్చరికలను కాదని వారిద్దరి చిత్రాలను విడుదల చేసే థియేటర్లలో చోటుచేసుకునే అనుచిత, అవాంచనీయ ఘటనలకి తమకి ఎలాంటి సంబంధం ఉండదని ఆయన ప్రకటించారు.