ఎమ్మెల్యేల కోసం శర్మ బస్సులే ఎందుకంటే ?

karnataka mlas in sharma travels bus

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

క‌ర్ణాట‌క రాజ‌కీయం అంతా ఒక పొలిటికల్ డ్రామా సినిమాను త‌ల‌పిస్తోంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతున్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే బీపీ లేని వారికి కూడా బీపీ వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ రేపు బలనిరూపణ చేసుకోనుంది. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు, బీజేపీ ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండేందుకు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలను కాంగ్రెస్-జేడీఎస్ లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండుమూడు రోజుల నుంచి జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను హోటళ్లు, రిసార్టులకు తిప్పుతున్నాయి.

అయితే, క‌ర్ణాట‌క నుంచి హైద‌రాబాద్ కు మార్చే క్ర‌మంలోనూ మార్గ‌మ‌ధ్యంలో ఎక్క‌డ ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇవ్వ‌కుండా ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌లు తీసుకున్నారు కాంగ్రెస్,జేడీఎస్ నేత‌లు. ముందుగా ప్ర‌త్యేక విమానంలో వారిని త‌ర‌లించాల‌ని భావించినా, ప్ర‌త్యేక విమానానికి అనుమ‌తి ల‌భించ‌క‌పోవ‌డంతో క‌ర్నూలు మీదుగా ఓ ట్రావెల్స్ బ‌స్సులో త‌ర‌లించారు.అయితే ఆ ట్రావెల్స్ కూడా బీజేపీకి సంబంధం లేకుండా, బీజేపీ నేత‌ల‌కు ట‌చ్ లోకి వెళ్ల‌కుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇందుకుగాను శర్మ ట్రావెల్స్ కు చెందిన టూరిస్ట్ బస్సులను మాత్రమే కాంగ్రెస్ వినియోగించింది. దీంతో సాధారణంగానే ‘శర్మ’ బస్సులనే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎందుకు వినియోగిస్తోందనే దానిపై పలువురికి సందేహాలు రావడం సహజం. అయితే ఈ సంస్థ బస్సులను ‘కాంగ్రెస్’ వినియోగించడానికి గల కారణం ఏంటంటే ఈ బస్సు సర్వీసుల యజమాని కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత నమ్మకస్తుడు. ఆ కారణంగానే ఆయన బస్సు సర్వీసులపై నమ్మకంతో వాటినే ఉపయోగిస్తున్నారు.

శర్మ ట్రావెల్స్‌ యజమాని డీ‌ పీ‌ శర్మ కాంగ్రెస్‌కు ఎంతో విశ్వాసపాత్రుడు. ఆయన రాజస్థాన్‌కు చెందిన మార్వాడీ వర్గానికి చెందిన వ్యక్తి 1980ల్లో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో బాగా సంపాదించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1998లో సౌత్‌ బెంగళూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ప్రస్తుత కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే మీద ఓడిపోయారు. డీపీ శర్మ 2001లో చనిపోయినా ఆయన కుమారుడు సునీల్‌ కుమార్‌ శర్మ తండ్రి వ్యాపారాన్ని అంది పుచ్చుకున్నాడు.