అనుమానంతో భార్యని హత్య చేశాడో భర్త

అనుమానంతో భార్యని హత్య చేశాడో భర్త

అక్రమ సంబంధం అనుమానంతో భార్యతో పాటు అత్తను కూడా హత్య చేశాడో భర్త. బెంగళూరు గోవిందరాజనగర పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. వివరాలు.. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లికి చెందిన రవికుమార్‌ భార్య సావిత్రి, అత్త సరోజమ్మలతో కలిసి మూడలపాళ్యలో బాడుగ ఇంటిలో ఉంటున్నారు. బెంగళూరుకు 20 ఏళ్లు క్రితం వలస వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని భర్త అనుమానించసాగాడు. దీనిపై అనేకసార్లు దంపతులు గొడవపడ్డారు.

పలుసార్లు ఇల్లు కూడా మార్చాడు. మంగళవారం ఉదయం పిల్లలను స్కూల్‌ వద్ద వదిలి భార్యతో మళ్లీ ఘర్షణ పడ్డాడు. కోపం పట్టలేక కొబ్బరికాయలను కొట్టే కత్తిని తీసుకుని భార్య సావిత్రి, ఆమె తల్లి సరోజమ్మను నరికిచంపాడు. తరువాత స్కూటర్‌పై గోవిందరాజనగర పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాలకు విక్టోరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.