జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో ఉగ్రవాది జాహుర్ ని పోలీసులు అరెస్టు చేశారు. లష్కరే తోయిబాకు జాహుర్.. టాప్ మోస్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతని వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
అలాగే.. ఇదే ఘటనలో మరో నలుగుర్ని కూడా అరెస్టు చేసినట్లు సమాచారం అందుతుంది. జాహుర్ వాణి.. బుద్గామ్తో పాటు బారాముల్లా ప్రాంతాల్లో కూడా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబాకు చెందిన యూసుఫ్ ఖంత్రూతో జాహుర్ అత్యంత సన్నిహితంగా మెలిగాడని సమాచారం. అంతేకాకండా అతని ఇంటికి కేవలం 300 మీటర్ల దూరంలో ఆయుధ స్థావరం ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఖంత్రూకు చెందిన లష్కరే బృందానికి.. జాహుర్ వాణి అన్ని రకాల ఆయుధాలు సరఫరా చేసేవాడని కూడా పోలీసులు గుర్తించారు.
One hideout busted in Arizal Khansaib,Budgam & a top Over Groud Wirker of LeT, namely Zahoor Wani was arrested. Arms and ammunition recovered from his possession.
More arrests and recoveries are expected. Case registered. pic.twitter.com/sFMfVft7Dh— J&K Police (@JmuKmrPolice) May 16, 2020