ఛిఛీ… నీది ఆడ జన్మేనా?

Kasturi Shankar Controversy Tweets On Sridevi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
శ్రీదేవి మరణ వార్త సినీ వర్గాల వారికి మరియు ప్రేక్షకులకు అందరికి కూడా కన్నీరు తెప్పించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా శ్రీదేవి గురించి మాట్లాడుకుంటూ అయ్యో అంటున్నారు. ఇక సినీ పరిశ్రమకు చెందిన వారు శ్రీదేవితో తమ అనుబంధాన్ని నెమరవేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్‌ నటి కస్తూరి చేసిన ఒక ట్వీట్‌ విమర్శలకు తెర లేపింది. కస్తూరి చేసిన ఒక ట్వీట్‌ ఆమె స్థాయిని అమాంతం పాతాలానికి పడేసింది.

ట్విట్టర్‌లో శ్రీదేవి మరణంపై స్పందించిన కస్తూరి శంకర్‌… అన్ని న్యూస్‌ ఛానెల్స్‌ కూడా శ్రీదేవి మరణంతో ఆమె పాత సినిమాల క్లిప్పింగ్‌లను మరియు ఆమె సినిమా పాటలను వేస్తున్నారు. మరి సన్నీలియోన్‌ చనిపోతే ఈ మీడియా సంస్థలు ఏం వేస్తాయో అంటూ స్మైల్‌ సింబల్స్‌ను పోస్ట్‌ చేసింది. ఈమె చేసిన ట్వీట్‌కు ఆమెను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారు మరియు ఇతరులు అంతా కూడా చాలా దారుణంగా రిప్లైలు ఇస్తున్నారు. ఛీఛీ నీది ఆడ జన్మనా అంటూ ఎక్కువ శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్తూరి ఎందుకు ఇలాంటి ట్వీట్‌ చేసిందని కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో ఈ విషయమై పెద్ద చర్చ జరుగుతుంది.

Kshuri Shankar tweet on Sridevi