‘ఎన్టీఆర్‌’ కథానాయకుడు, మహానాయకుడు

Kathanayakudu & Mahanayakudu 2 parts Devided IN NTR Biopic

నందమూరి ఫ్యాన్స్‌ మరియు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రం భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న నేపథ్యంలో ప్రేక్షకులను నిరుత్సాహ పర్చవద్దనే ఉద్దేశ్యంతో దర్శకుడు క్రిష్‌ రెండు పార్ట్‌లుగా ఈ చిత్రాన్ని విడదీసినట్లుగా సమాచారం అందుతుంది. తాజాగా ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా విడుదల చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అందుకు సంబంధించిన డేట్లు కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది.

Kathanayakudu IN NTR Biopic

‘ఎన్టీఆర్‌’ మొదటి పార్ట్‌ను ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ అంటూ విడుదల చేయబోతున్నారు. మొదటి పార్ట్‌లో ఎన్టీఆర్‌ సినీ రంగంకు సంబంధించిన విశేషాలను చూపించబోతున్నారు. ఈ చిత్రంను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక రెండవ పార్ట్‌ను ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ అంటూ విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రాన్ని రిపబ్లిక్‌ డే సందర్బంగా జనవరి 24న విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. రెండు పార్ట్‌లకు సంబంధించిన చిత్రీకరణను డిసెంబర్‌లోనే పూర్తి చేయబోతున్నారు. రెండు పార్ట్‌లను ఒకే నెలలో అదీను రెండు వారాల గ్యాప్‌లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.